ఎద్దులబండితో.. నడుములోతు నీటిలో ప్రయాణం
కర్ణాటకను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల ధాటికి నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు నడుములోతు నీటిలో రాకపోకలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు ఎద్దుల బండిలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదిని దాటుతున్నారు. యడ్రామి తాలూకా తెలగబాల-కడకోల గ్రామాల మధ్య నదిపై వంతెనను నిర్మించి తమ కష్టాలను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.