పీఓకే కోసం వేదపండితుల కోటి తులసీ దళార్చన - special prayers for pok
పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో భాగం చేయడమే లక్ష్యంగా... కర్ణాటక ఉడిపి జిల్లాలోని వేద పండితులు కోటి తులసి అర్చన మహోత్సవం నిర్వహించారు. ఉడిపి కృష్ణ మఠం రాజంగనలో 2500 మంది పండితులు వేద మంత్రోచ్ఛారణలతో శ్రీకృష్ణుడికి కోటి తులసి దళాలను అర్పించారు. ఈ ఆరాధనను దేశ భద్రతకు అంకితం చేస్తున్నట్లు పాలిమారు స్వామీజీ తెలిపారు. "ఇన్నాళ్లకు భారత్.. తన కిరీటమైన జమ్ముకశ్మీర్ పొందింది" అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ పొందుతుందని విద్యాధిష తీర్థ, పాలిమారు స్వామీజీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Last Updated : Oct 1, 2019, 7:35 PM IST