ట్రాక్‌పై పల్టీలు కొట్టి.. రేసులో దూసుకెళ్లిన కారు - కర్ణాటక అప్డేట్స్
కర్ణాటకలోని హాసన్ జిల్లాలో నిర్వహించిన కారు రేసులో ఓ వాహనం మూడు పల్టీలు కొట్టి.. అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. రేసులో పాల్గొన్న 'మారుతీ-800' కారు వేగంగా దూసుకొచ్చింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల.. ట్రాక్‌లో మలుపు వద్ద ఒక్కసారిగా పల్టీలు కొట్టి యథాస్థితిలో ఆగింది. ఆ సమయంలో చోదకుడు చాకచక్యంగా వ్యవహరించి స్టీరింగ్‌ను అదుపులో ఉంచుకున్నాడు. అనంతరం.. అదే వేగంతో మళ్లీ కారును డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లాడు. కానీ అప్పటికే ఆలస్యమవడం వల్ల అతడు రేసులో ఓడిపోయాడు.