జయప్రదకు కోపమొచ్చింది... కారణం ఇదే - UP
ఎప్పుడూ నవ్వుతూ ఉండే అలనాటి తార జయప్రదకు ఒక్కసారిగా పట్టరాని కోపమొచ్చింది. ఉత్తరప్రదేశ్ రామ్‌పుర్ స్థానిక భాజపా నేతలపై ఆవేశంతో ఊగిపోయారు ఆమె. ప్రచార షెడ్యూల్లో మార్పులు చేసి అమూల్యమైన సమయం వృథా చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవలే భాజపాలో చేరిన జయప్రద... రామ్‌పుర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.