కశ్మీర్లో భారీ వర్షాలు- కొట్టుకుపోయిన రహదారులు - కశ్మీర్
జమ్ము కశ్మీర్ పూంచ్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. దింగ్లా ప్రాంతంలో కురిసిన ఈ వర్షాల ధాటికి పలు ఇళ్లు, రహదారులు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. అప్పర్ దింగ్లాకు వెళ్లే రహదారి పూర్తిగా కొట్టుకుపోయినట్లు వెల్లడించారు. రెండు ద్విచక్ర వాహనాలతో పాటు ఓ కారు సైతం వరదల ధాటికి కొట్టుకుపోయాయని పేర్కొన్నారు.