హిమగిరి సొగసులు: మంచు దుప్పటిలో కశ్మీరం - pir panjal snowfall
జమ్ముకశ్మీర్‌లో కొన్నిరోజుల నుంచి జోరుగా మంచుకురుస్తోంది. పీర్ పంజాల్ పర్వత శ్రేణి ప్రాంతాలు మంచు ఖండాన్ని తలపిస్తున్నాయి. ఊరూవాడ, చెట్టూచేమ, కొండాకోనలను మంచు కప్పేసింది. పూర్తిగా హిమంతో ఉన్న పలు ప్రాంతాలు అందాల లోకంగా కనిపిస్తూ అబ్బురపరుస్తున్నాయి. హిమాలయ శ్రేణిలో తక్కువ ఎత్తులో ఉండే పీర్ పంజాల్ పర్వత శ్రేణులు.... అందంగా దర్శనమిస్తున్నాయి. హిమపాతం ధాటికి కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై దట్టంగా ఏర్పడిన మంచును యంత్రాల ద్వారా తొలగిస్తున్నారు.