తమిళనాడు: జల్లికట్టు జోరు... బసవన్నల హోరు - palamedu latest news
సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జల్లికట్టు.. తమిళనాట ఉత్సాహంగా సాగుతోంది. మధురై సమీపంలోని పాలమేడులో 700 బసవన్నలతో ఉదయం నుంచే పోటీలు నిర్వహిస్తున్నారు. ఎద్దులను నియంత్రించేందుకు యువకులు పోటీ పడుతున్నారు. జల్లికట్టు పోటీలను చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి పాలమేడుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు ప్రజలు.