రాజస్థాన్ యూనివర్సిటీలో ఉద్రిక్తత - abvp students latest news in rajastan
జైపుర్‌లోని రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. బోనస్ మార్కులు సహా ఇతర సమస్యలపై ఏబీవీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ ఛాంబర్‌ను దిగ్బంధించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అనంతరం విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.