18 వేల అడుగుల ఎత్తులో జవాన్ల యోగా - Ladakh
ఈ నెల 21న 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండో-టిబెట్ సరిహద్దు దళం (ఐటీబీపీ) సైనికులు యోగా ప్రాముఖ్యాన్ని చాటిచెప్పారు. జమ్ముకశ్మీర్‌లోని లద్దాఖ్ ప్రాంతంలో 18 వేల అడుగుల ఎత్తులో యోగాసనాలు వేశారు. అందరూ ప్రతి రోజు యోగా చేయాలని సూచించారు.