సరిహద్దులో సైనికుల డ్రిల్.. చైనాకు హెచ్చరికలు! - ఎస్ఏసీలో భారత సైన్యం
భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో భారత జవాన్లు చైనాకు దీటుగా డ్రిల్ నిర్వహించారు. ఎలాంటి సవాళ్లను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ విన్యాసాల ద్వారా చైనాకు సంకేతాలు అందించారు.