స్ట్రెచర్‌పై తల్లీబిడ్డలను మోస్తూ.. జవాన్ల నడక
సైనికులంటే సరిహద్దుల్లో ఉంటూ దేశాన్ని రక్షించడమే కాదు.. ప్రజలకు ఏ మాత్రం ఆపద వచ్చినా 'మేమున్నామ'ని ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుకుంటున్నారు కూడా. తాజాగా.. కశ్మీర్ కుప్వారా ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది ఓ మహిళ. అయితే భారీగా మంచు కురుస్తుండటం వల్ల అక్కడే చిక్కుకుపోయింది. ఈ నేపథ్యంలో ఆ తల్లీబిడ్డలను స్ట్రెచర్‌పై మోస్తూ.. కుప్వారా నుంచి 6 కిలోమీటర్లు నడిచి వారిని ఇంటికి చేర్చారు.