రావణ దహనంలో పేలుడు- త్రుటిలో తప్పించుకున్న నేత - బాటాలాలో ప్రమాదం
పంజాబ్ బాటాలాలో జరిగిన విజయదశమి వేడుకల్లో ప్రమాదం చోటు చేసుకుంది. రావణుడి బొమ్మకు నిప్పంటించగా.. పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ప్రమాదంలో కాంగ్రెస్ నేత అశ్వనీ సేఖ్డీ, అతని మద్దతుదారులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది వేడుకలను నిర్వహించేందుకు పాత దసరా కమిటీ తొలుత నిరాకరించింది. అందువల్ల రామ్ తీర్థ రోడ్డులోని ఎలిఫెంట్ గేట్లో వేడుకలను అశ్వనీ సేఖ్డీ నిర్వహించారు.
Last Updated : Oct 26, 2020, 7:02 AM IST