తెలంగాణ

telangana

ETV Bharat / videos

రైల్వే పోలీస్ సాహసం​​- ఆ ఇద్దరూ సేఫ్​! - మహారాష్ట్ర వార్తలు

By

Published : Jun 13, 2021, 8:43 AM IST

ప్లాట్​ఫాం మీద నుంచి రైలు కింద పడబోయిన ఓ వ్యక్తిని ప్రాణాలు తెగించి కాపాడారు రైల్వే సిబ్బంది. ఈ ఘటన మహారాష్ట్ర ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్​ టర్మినస్​లో జరిగింది. ముంబయి నుంచి మంగళూరు ప్రత్యేక ఎక్స్​ప్రెస్​ బయలుదేరిన సమయంలో రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి.. అదుపు తప్పి రైలు కింద పడబోయాడు. అక్కడే ఉన్న రైల్వే గార్డు జితేంద్ర పాల్, ఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్ నరసింహా కనోజియా అతడిని చక్రాల కింద పడకుండా కాపాడారు. అయితే.. రక్షించే క్రమంలో గార్డు కూడా అదుపు తప్పి ప్లాట్​ఫాంపై పడిపోయారు. దీంతో జితేంద్రను కానిస్టేబుల్​ వెనక్కు లాగారు. అనంతరం ఇద్దరూ కలిసి ప్రయాణికుడిని రక్షించారు.

ABOUT THE AUTHOR

...view details