నాగిని నాట్యం చేస్తూ యువకుడు మృతి! - కాహ్నివాడి
మధ్యప్రదేశ్ కాహ్నివాడాలోని కటీయా గ్రామంలో నాగిని నాట్యం చేస్తూ ప్రాణాలు విడిచాడో కుర్రాడు. వినాయక నిమ్మజ్జన ఉత్సవాల్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. శోభాయాత్రలో జోరుగా నృత్యం చేస్తోన్న గురుప్రసాద్ ఠాకూర్ ఉత్సాహంతో ఒక్కసారిగా పల్టీ కొట్టే ప్రయత్నం చేశాడు. తలకు బలమైన గాయం తగిలింది. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. గురుప్రసాద్కు గతంలో ఒకసారి తలకు గాయమైందని, అందుకే ఇలా జరిగి ఉంటుందని గ్రామస్థులు తెలిపారు.
Last Updated : Sep 30, 2019, 1:45 PM IST