ఫోన్ దొంగలించి.. యజమానిని ఈడ్చుకెళ్లి.. - ఫోన్ దొంగతనం
ఓ కార్మికుడి చరవాణిని కొట్టేయడమే కాకుండా, అతడిని బైకుపై చాలా దూరం దారుణంగా ఈడ్చుకెళ్లారు దుండగులు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్‌లో జరిగింది. బిహార్‌కు చెందిన అలీ అక్బర్ నుంచి కాల్ మాట్లాడే నెపంతో దొంగలు ఫోన్ తీసుకున్నారు. అనంతరం.. బైకు వేగం పెంచి పారిపోబోయారు. అయితే బైకును కార్మికుడు అలాగే పట్టుకొని ఉండటం వల్ల అతడిని రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ క్రమంలో అలీతో పాటు బైకుపై వెనకాల కూర్చున్న దొంగ కూడా కిందపడిపోయాడు. ఆ తర్వాత బైకును వెంబడించినా ప్రయోజనం లేకపోయింది. అయితే.. దుండగులకు చెందిన ఓ ఫోన్ కిందపడగా, దానిని పోలీసులకు అందించారు స్థానికులు.