VIRAL VIDEO: వీధుల్లో తిరుగుతూ మొసలి హల్‌చల్ - కర్ణాటక వార్తలు
కర్ణాటకలోని ఓ గ్రామంలో భారీ మొసలి హల్‌చల్ చేసింది. దండేలీ జిల్లా కొగిల్‌బాన్ గ్రామంలోకి ప్రవేశించి.. అక్కడి వీధుల్లో తిరుగుతూ భయాందోళనకు గురిచేసింది. గ్రామంలో ప్రమాదకరంగా సంచరిస్తున్న మొసలిని చూసి అవాక్కైన గ్రామస్థులు.. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. భారీ మొసలిని పట్టుకొని సమీపంలోని నదిలో విడిచిపెట్టారు.