ఊరంతా చిందులెయ్యాలా .. కరోనాను పక్కనపెట్టాలా! - కరోనా సమయంలో డీజే డ్యాన్స్‌లు
వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఆంక్షలు విధించినా.. కొందరు వాటిని ఖాతరు చేయట్లేదు. గుజరాత్ సాబర్కంటా జిల్లాలోని నాడా గ్రామంలో.. ఓ వివాహ వేడుకలో వందలాది మంది కలిసి నృత్యాలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వేడుకల్లో 50మంది కన్నా ఎక్కువ పాల్గొనకూడదు. అయినా.. భౌతిక దూరం, మాస్క్‌లు వంటి నిబంధనలను పక్కనపెట్టి గుంపులుగా చిందులేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం దర్యాప్తునకు ఆదేశించింది.