Video viral: ఆటో ఢీ కొట్టి ఆమడ దూరంలో.. - బైక్ ఆటో ఢీ
కర్ణాటక బెంగళూరులో రోడ్డుపై వస్తున్న ఓ మహిళను ఆటో ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు దగ్గరలోని నిమన్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెను సంపంగిరామనగర్కు చెందిన శశికళగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన విల్సన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తొలుత ఆ ఆటోను వేగంగా వచ్చిన ఓ ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ కారణంగా ఆటో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ప్రమాదం జరిగింది. ఈ దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.