ట్రైనింగ్ కోసం తల్లికి దూరంగా బుజ్జి ఏనుగు- నేను రానంటూ ప్రతిఘటన! - ఎనుగు వీడియో వైరల్
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ఓ ఏనుగును తల్లి నుంచి సిబ్బంది వేరు చేశారు. ఈ క్రమంలో ఆ పిల్ల ఏనుగు ప్రతిఘటించింది. కానీ తాళ్లతో బంధించి బలవంతంగా ఆ రెండు ఏనుగులను సిబ్బంది వేరు చేశారు. 'పునీత్ రాజ్‌కుమార్'గా పిలిచే ఈ గున్న ఏనుగును వేరే ప్రాంతానికి తరలించారు. ట్రైనింగ్‌లో భాగంగానే ఇలా చేశామని.. మూడు రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి ఆ తర్వాత శిక్షణ ప్రారంభిస్తామని సిబ్బంది వెల్లడించారు.