పొలంలో హెలికాప్టర్ ల్యాండింగ్ - IAF today news
సాధారణంగా హెలికాప్టర్ ల్యాండ్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లతో సన్నద్ధమై ఉంటారు అధికారులు. అయితే.. అందుకు భిన్నంగా ధృవ్ హెలికాప్టర్ ఉన్నట్టుండి ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతంలో దర్శనమిచ్చింది. సాధారణ శిక్షణా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్.. ముందు జాగ్రత్త చర్యగా సహారన్‌పుర్‌లో ల్యాండ్ చేసింది భారత వైమానిక దళం. బహిరంగ ప్రదేశంలో ల్యాండ్ అయిన ఈ హెలికాప్టర్‌ను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు అక్కడి ప్రజలు.