వైరల్: బైక్పై కొండ చిలువ విన్యాసాలు అదుర్స్ - కర్ణాటక
కర్ణాటక రాంనగర్ జిల్లా అవరగెరే గ్రామంలో రోడ్డు పక్కన ఓ భారీ కొండ చిలువ హల్చల్ చేసింది. భారీ సరీసృపాన్ని చూసిన గ్రామస్థులు భయంతో కేకలు వేశారు. అరుపులకు డిస్టర్బ్ అయిన కొండ చిలువ... రోడ్డు పక్కనే ఉన్న బైక్ ఎక్కేసి కంటిచూపుతోనే అక్కడున్నవారికి వార్నింగ్ ఇచ్చింది. అలానే కాసేపు బైక్పై కూర్చుంది. ఇంతలో అటవీ శాఖ అధికారులు వచ్చి కొండ చిలువను బంధించారు. మాయాగహనహళ్లి దగ్గర్లోని ఉలాతార్ అడవిలోకి సాగనంపారు.
Last Updated : Sep 28, 2019, 7:20 AM IST