నదిలో కొట్టుకుపోయిన రెండంతస్తుల భవనం - కుప్పకూలిన భవనం
కేరళలో భారీ వర్షాలు(heavy rain in kerala) బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు(floods in kerala) ముంచెత్తుతున్నాయి. కొట్టాయం జిల్లాలోని ముందక్కయమ్లో నది ఉప్పొంగి.. రెండంతస్తుల భవనం కొట్టుకుపోయింది. అంతా చూస్తుండగానే.. భవనాన్ని వరద తనలో కలిపేసుకుంది. అప్పటికే అందులో ఉండే కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించటం వల్ల ప్రమాదం తప్పింది.