తెలంగాణ

telangana

ETV Bharat / videos

రైలు ఎక్కబోయి కిందపడ్డ వృద్ధుడు- కాపాడిన పోలీసు - old man has been protected by rpf jawan

By

Published : Jan 30, 2021, 8:12 PM IST

రైలు ఎక్కబోయి కిందపడిన 79ఏళ్ల ప్రయాణికుడిని ఆర్పీఎఫ్ పోలీసు రక్షించిన వీడియో వైరల్​ అవుతోంది. ముంబయిలోని కల్యాణ్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిందీ ఘటన. దిల్లీకి చెందిన మసూర్ బఫూర్ అహ్మద్.. కల్యాణ్ స్టేషన్​లో పంజాబ్ మెయిల్ ఎక్కడానికి ప్రయత్నించే క్రమంలో ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫాం-రైలు మధ్య చిక్కుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన ఎస్పీ యాదవ్, జితేంద్ర గుజార్ అనే ఆర్‌పీఎఫ్ పోలీసు మసూర్‌ను పైకి లాగి ప్రాణాలను కాపాడారు. ప్రాణాలకు తెగించి తనను కాపాడినందుకు ఆ వృద్ధుడు ఆర్‌పీఎఫ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details