హిమాచల ప్రదేశం.. శ్వేతవర్ణ శోభితం - Himachal pradesh snowfall news
హిమాచల్ ప్రదేశ్ నర్కంద, సిమ్లా జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా మంచు కురుస్తోంది. హిమపాతం మూలంగా ఆయా ప్రాంతాలు శ్వేతవర్ణ శోభితంగా కనువిందు చేస్తున్నాయి. ఆ ముగ్ధమనోహర దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. రోడ్లన్నీ మంచుతో నిండిపోయి రాకపోకలకు ఇబ్బందులు తప్పటం లేదు. ఉత్తరాఖండ్‌లోనూ మంచు కురుస్తోంది. కేదార్నాథ్ ఆలయం ప్రాంతం మంచు దుప్పటితో కప్పుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.