రాళ్లు రువ్వుకుంటూ యువకుల సంబరాలు - రాళ్లు విసురుకునే ఆచారం
హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలోని ధామీ గ్రామంలో భక్తులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. గ్రామంలోని పురుషులు రెండు బృందాలుగా విడిపోయి రాళ్లు విసురుకుంటున్న దృశ్యాలు చిన్నపాటి యుద్ధాన్నే తలపించాయి. అయితే ఇక్కడ ఎలాంటి గొడవా జరగలేదు. ఈ ప్రాంతంలో ఏటా ఇలా రాళ్లు రువ్వుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇలా వినూత్నంగా గ్రామదేవతను కొలుస్తూ... తమ సంప్రదాయాన్ని కాపాడుకునేందుకు వందలాది మంది యువకులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
Last Updated : Oct 29, 2019, 1:01 PM IST