ఏడు పదుల వయసులోనూ హేమ మాలిని నాట్యం భళా - hemamalini as radha dancing on stage
దశాబ్దాల క్రితమే కథానాయకులతో సమానంగా గుర్తింపు సంపాదించుకున్న హేమ మాలిని.. ఆమె అభిమానుల కోసం ఏడు పదుల వయసులో రాధ వేషం కట్టి... వీక్షకులను కట్టిపడేశారు. అలనాటి అందం, అభినయం ఈనాటికీ చెక్కు చెరగలేదని మరోసారి నిరూపించారు. బిహార్ బోధ్గయాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 'అంతర్జాతీయ బౌద్ధ మహోత్సవాన్ని' ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హేమా అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు.
Last Updated : Feb 28, 2020, 12:12 PM IST