కశ్మీర్‌ను కమ్మేసిన మంచు- విమాన సేవలు బంద్ - కశ్మీర్ రోడ్లపై కురుస్తోన్న మంచు
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ ప్రాంతంలో మంచు భారీగా కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న హిమపాతం వల్ల.. ఇళ్లు, వాహనాలపై మంచు కొన్ని అంగుళాల మేర పేరుకుపోయింది. రహదారులన్నీ పూర్తిగా మంచుతో నిండిపోయాయి. ఫలితంగా మధ్యాహ్న సమయంలోనూ అక్కడి ప్రజలు బయటకు రాలేక అవస్థలు పడుతున్నారు. వాహనాల రాకపోకలకూ తీవ్ర అంతరాయం ఏర్పడగా.. విమాన సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.