ముంచెత్తిన వరదలు- స్తంభించిన జనజీవనం - ముంబయిలో వర్షాల ప్రభావం
మహారాష్ట్ర ముంబయి నగరంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి వరద నీరు ప్రవేశించింది. చాలా చోట్ల రాకపోకలు స్తంభించిపోయాయి. చెంబుర్, విక్రోలిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 25 మంది మృతి చెందారు. వర్షాల కారణంగా ముంబయిలోని చాలా ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. వర్షాల కారణంగా సోమవారం ముంబయి సబర్బన్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.