యువకులతో మాజీ ముఖ్యమంత్రి కబడ్డీ
ఉత్తరాఖండ్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న క్రమంలో ప్రచారంలో దూసుకెళ్తున్నాయి పార్టీలు. ప్రజలను ఆకర్షించడానికి నాయకులు సామాన్యులతో మమేకమవుతూ వివిధ కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తనదైన శైలిలో కనిపించారు. నైనితాల్ జిల్లాలోని లాల్కువాన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రావత్.. ఆదివారం బిందుఖతాలో పర్యటించారు. ఈ క్రమంలో స్థానిక పాఠశాలలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలను ప్రారంభించారు. యువకులతో కలిసి కాసేపు కబడ్డీ ఆడారు. అనంతరం తమకు మద్దతు పలకాలని యువకులను కోరారు రావత్. రెండు రోజుల క్రితం హల్ద్వానీ నగరంలోని ఓ దుకాణంలో జిలేబీ చేస్తూ.. జిలేబీవాలాగా మారి అభిమానులను ఆకట్టుకున్నారు.