షిరిడీలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు - Saibaba
గురుపౌర్ణమి వేడుకలకు షిరిడీలోని సాయిబాబా మందిరం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. గురుపౌర్ణమి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామునుంచే భక్తజనంతో కిటకిటలాడుతోంది. బాబా నామస్మరణతో అందరూ భక్తి పరవశంలో మునిగితేలుతున్నారు. సాయి దర్శనానికి పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు.