పరిహారం కోసం 'సజీవ సమాధి'తో రైతుల నిరసన - farmers burreid
నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని గుజరాత్ రైతులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. సజీవ సమాధి తరహాలో ఆందోళన వ్యక్తం చేశారు. శిరస్సు వరకు శరీరాన్ని భూమిలో పూడ్చుకుని ప్రభుత్వానికి తమ ఆవేదన తెలియజేశారు. వర్షం వల్ల పంట నష్టం జరిగిందని.. బీమా వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సంప్రదించినా ఫలితం లేదని చెప్పారు రాజ్కోట్ జిల్లా దోరాజీ తాలుకా రైతులు.