viral video: వామ్మో.. రైల్వేట్రాక్‌పై 12 అడుగుల కొండచిలువ - ట్రాక్‌పై కొండ చిలువ
ఉత్తరాఖండ్ హల్ధ్వానీలో భారీ కొండచిలువ ప్రాణాలను రక్షించారు అధికారులు. జిల్లాలోని బేరిపాడవ్ రైల్వేగేటు వద్ద కొండ చిలువ మొదటి కనిపించింది. మరికొద్దిసేపట్లో రైలు వచ్చే సంకేతాలు అందని నేపథ్యంలో అధికారులు దానిని తప్పించేందుకు ముమ్ముర ప్రయత్నాలు చేశారు. కానీ సాధ్యంకాకపోవడం కారణంగా అటవీ ఉద్యోగులకు సమాచారం అందించారు. సరైన సమయానికి ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది కొండచిలువను కాపాడారు. అనంతరం దానిని అడవిలో విడిచిపెట్టారు. ఇది సుమారు 12 అడుగులు పైనే ఉన్నట్లు తెలిపారు.