అహ్మదాబాద్లో 'అభినందన వినాయకుడు'! - ABHINANDAN
దేశవ్యాప్తంగా గణేశ్ చతుర్థి ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. కొబ్బరి కాయలతో, అరటి ఆకులతో, కరెన్సీ నోట్లతో ఇలా ఒక్కో మండపంలో ఒక్కో ఏకదంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకతను చాటుతున్నారు ఆయా ప్రాంత వాసులు. గుజరాత్లోని అహ్మదాబాద్ ప్రజలు మరింత వినూత్నంగా ఆలోచించారు. బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో వీరోచితంగా పోరాడిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ప్రతిమ రూపంలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చేతిలో జాతీయ జెండా, చుట్టూ మిగ్-21 జెట్ల బొమ్మలున్న ఈ ప్రతిమ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.
Last Updated : Sep 29, 2019, 10:20 AM IST