గణనాథుడికి ప్రకృతి చెప్పిన శుభాకాంక్షలు!
దేశం గణనాథుడి స్మరణలో మునిగిపోయింది. విఘ్నేశ్వరుడు కూడా వివిధ రూపాల్లో భక్తుల ఇళ్లల్లో కొలువుదీరాడు. అయితే కర్ణాటక మంగళూరులోని వామంజూరు శివారులో ప్రకృతిసిద్ధమైన గణేశుడి ఆకృతి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అమృతేశ్వర ఆలయానికి వెళ్లే రోడ్డులో.. తీగలు, ఆకులు, పొదలన్నీ కలిసి ఉన్న రూపం.. గణనాథుడిని పోలి ఉంది. ఆ లంబోదరుడికి ఉండే చెవులు, చేతులు, తొండం ఆకారంలో ఆకులు ఉండటం విశేషం.