'హిమ' కశ్మీరం: మంచు కురిసే వేళలో... - LATEST NEWS OF SNOWFALL IN HIMACHAL
జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో మంచు వర్షం ఎడతెరిపిలేకుండా కురుస్తోంది. శ్రీనగర్లో ఈ సీజన్‌లో మంచు కురవడం ఇదే తొలిసారి. నగరంలో ఎటుచూసినా శ్వేత వర్ణమే కనిపిస్తోంది. రహదారులు, సరస్సుల్లో మంచు పొర పేరుకుపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మంచు వర్షం.. పర్యటకులకు కనువిందు చేస్తోంది. కులు జిల్లాలోని..మనాలీ, సోలాంగ్ నల్లా ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తోంది. మంచుతో కులు పరిసర ప్రాంతాల్లో.. ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. మంచు వర్షాన్ని ఆస్వాదించేందుకు వచ్చే పర్యటకుల సంఖ్య బాగా పెరిగిందని స్థానిక అధికారులు వెల్లడించారు.