ఆంక్షలు బేఖాతరు- అంత్యక్రియలకు వేలమంది హాజరు - గుజరాత్లో కరోనా మరణాలు
గుజరాత్ కచ్‌లో అంత్యక్రియలకు వేలమంది హాజరైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. స్థానికంగా మరణించిన ముస్లిం నేత హజ్రత్ హాజీ అహ్మద్‌షా బాబా బుఖారీ ముఫ్తీకి వీరంతా నివాళులర్పించారు. అంత్యక్రియలకు హాజరుకావద్దని బుఖారీ కుటుంబం విజ్ఞప్తి చేసినప్పటికీ అభిమానులు పట్టించుకోలేదు. మత సామరస్యానికి పాటుపడిన బుఖారీ.. హిందూ-ముస్లిం వర్గాలలో ప్రసిద్ధ వ్యక్తిగా పేరొందారు.