రైల్వే స్టేషన్లో కరోనాపై పోలీసుల 'ఫ్లాష్‌మాబ్'
చెన్నైలోని ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో కరోనాపై అవగాహన కల్పించడానికి పోలీసులు.. ఫ్లాష్‌మాబ్ నిర్వహించారు. వైరస్ బారిన పడకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కార్యక్రమం ద్వారా తెలిపారు. అలాగే అర్హులైనవారు టీకా తీసుకోవడం, సరిగ్గా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం సహా సబ్బుతో తరచు చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తల గురించి ప్రదర్శన చేస్తూ వివరించారు.