తెలంగాణ

telangana

ETV Bharat / videos

సరస్సు మధ్యలో థియేటర్​- బోటులో విహరిస్తూ సినిమాను చూడొచ్చు! - దాల్​ సరస్సుపై ఓపెన్ థియేటర్​

By

Published : Oct 30, 2021, 4:17 PM IST

జమ్ముకశ్మీర్‌ శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సుపై ఆ రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీనగర్‌ స్మార్ట్‌ సిటీ, జమ్ముకశ్మీర్​ యూత్‌ మిషన్‌ యంత్రాంగంతో కలిసి పర్యటక శాఖ ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. నీటిపై తెరను ఏర్పాటు చేసిన అధికారులు దానిపై చలన చిత్రాలను ప్రసారం చేశారు. దాల్‌ సరస్సు చూసేందుకు బోటులో వచ్చిన పర్యటకులకు ఆ చిత్రాన్ని వీక్షించే వెసులుబాటు కల్పించారు. జమ్ముకశ్మీర్‌ పర్యాటక శాఖ చేసిన ఈ ప్రయత్నానికి సందర్శకుల నుంచి విశేష స్పందన వస్తోంది. అటు.. దాల్‌ సరస్సుపై ఏర్పాటు చేసిన లేజర్‌ షోలు కూడా పర్యటకులను ఆకట్టుకుంటున్నాయి.

ABOUT THE AUTHOR

...view details