చెట్టు ఎక్కి చిక్కాడు.. 'దళం' సాయంతో దిగాడు - latest news on kerala rescue poeration
ప్రమాదవశాత్తు కొబ్బరి చెట్టుపై చిక్కుకున్న గీత కార్మికుడిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఈ ఘటన కేరళ కన్నూర్ జిల్లాలోని చొక్లీ గ్రామంలో చోటు చేసుకుంది. మనోజ్ కుమార్ అనే వ్యక్తి అనారోగ్యంగా ఉన్న సమయంలో కల్లు తీసేందుకు చెట్టు ఎక్కాడు. కానీ చెట్టుపైనుంచి దిగలేక పోయాడు. గమనించిన స్థానికులు అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది నిచ్చెన సాయంతో మనోజ్‌ను రక్షించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.