కుక్క తోకకు టపాసులు కట్టి.. ఆకతాయిల కర్కశత్వం.. - కుక్కతోక తాజా వార్తలు
మూగజీవిపై కర్కశంగా వ్యవహరించారు కొందరు ఆకతాయి కుర్రాళ్లు. వీధికుక్క తోకకు టపాసులు కట్టి పేల్చారు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని కోర్ది పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై కోర్ది స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు.