పేపర్ గోదాంలో అగ్ని ప్రమాదం- భారీగా ఎగసిపడ్డ మంటలు - దిల్లీలో పేపర్ గోదాంలో మంటలు
దిల్లీలో భారీ అగ్నిప్రమాదం(Delhi Fire News) సంభవించింది. హర్ష్ విహార్ ప్రాంతంలోని పేపర్ రోల్స్ నిల్వ చేసిన గోదాంలో తెల్లవారుజామున భారీగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 17 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో(Delhi Fire News) ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.