తెలంగాణ

telangana

ETV Bharat / videos

సీఎం ఇంటి వద్ద రైతుల ఆందోళన- పోలీసుల లాఠీఛార్జ్​ - హరియాణా ముఖ్యమంత్రి

By

Published : Oct 2, 2021, 5:33 PM IST

ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ హరియాణా, పంజాబ్​ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల ఎదుట నిరసనలు చేపట్టారు. హరియాణా కర్నల్​లోని ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఇంటి ఎదుట రైతులు చేపట్టిన ఆందోళనలు(Farmers protest) ఉద్రిక్తతలకు దారి తీశాయి. టెంటు వేసి బైఠాయించిన రైతులను పోలీసులు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయగా వారు ప్రతిఘటించారు(farmers and police clash). బారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు రైతులు యత్నించగా ఉద్రిక్తత తలెత్తింది. కర్షకులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో రైతులను నిలువరించేందుకు పోలీసులు జల ఫిరంగులను(farmers and police clash) ప్రయోగించారు. మరోవైపు.. పంచకులలోని చండీమందిర్​ టోల్​ప్లాజా వద్ద రైతులపై పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details