1000 కేజీల దున్నపోతు.. బర్త్డే వేడుకలు అదుర్స్ - దున్నపోతు బర్త్డే
Farmer Celebrates Birthday of Buffalo: కేరళ మలప్పురానికి చెందిన బషీర్ అనే రైతు.. 1000 కేజీలకుపైగా బరువున్న దున్నపోతుకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు. స్థానిక వార్డు సభ్యుడు కేక్ కట్ చేశాడు. రాజమాణిక్యన్ అని పిలుచుకునే ఈ దున్నను నాలుగేళ్ల క్రితం కొనుగోలు చేశాడు బషీర్. అప్పటినుంచి తన సొంతబిడ్డలా చూసుకుంటున్నాడు. రూ. 10 లక్షలు ఇస్తామన్నా.. దీనిని ఇవ్వనంటున్నాడు ఆ రైతు. ముర్రా జాతికి చెందిన ఈ బఫెలోకు ప్రత్యేక ఆహారం, నీరు సమకూరుస్తాడు. బరువు ఎక్కువగా ఉన్నందున ప్రస్తుతం డైట్ చేయిస్తున్నాడు. బషీర్, రాజమాణిక్యన్ బంధాన్ని చూసి స్థానికులు మెచ్చుకుంటున్నారు.