'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్ ఘన నివాళి - ETV Bharat song
ప్రపంచానికి సత్యమార్గాన్ని చూపించిన మహనీయుడు.. బాపూజీ 150వ జయంతిని ప్రపంచమంతా ఘనంగా జరుపుకుంటోంది. జాతి యావత్ మహాత్ముని స్మరించుకుంటున్న తరుణాన ఈటీవీ భారత్ ... బాపూకి ఘననివాళి అందిస్తోంది. గాంధీజీకి అత్యంత ఇష్టమైన "వైష్ణవ జన తో" భజన ద్వారా అందరికీ చేరువవుతోంది. భారతదేశ మౌళికరూపమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని ఈ భజన గీతం ద్వారా ఈటీవీ భారత్ ప్రతిఫలింపజేస్తోంది. . రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు హైదరాబాద్లో ఈ గీతాన్ని ఆవిష్కరించారు. 15వ శతాబ్దానికి చెందిన గుజరాతీ కవి నర్సింగ్ మెహతా ఈ భజనను రచించారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా దేశంలోని ప్రముఖ గాయకులందరినీ ఈ భజన కీర్తన ద్వారా ఒక చోటకు చేర్చింది. దృఢ సంకల్పంతో జాతిమొత్తాన్ని ఏకం చేసి.. స్వరాజ్యాన్ని మనకు కానుకగా అందించిన మహనీయునికి ఈటీవీ భారత్ అందించిన నివాళి.. ఇది..!
Last Updated : Oct 2, 2019, 7:31 PM IST