పులితో ఎన్కౌంటర్- బెదరని జింకలు.. - పులి వైరల్ వీడియో
పులిని దూరం నుంచి చూడగానే ప్రాణభయంతో పరుగులు పెడతాయి ఇతర జీవులు. అలాంటిది అడుగు దూరంగా కళ్ల ఎదుట కనిపిస్తే వెన్నులో వణుకుపుట్టక మానదు. కానీ, ఉత్తరాఖండ్ రామ్‌నగర్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్క్‌లో వింత ఘటనే జరిగింది. పులి ఎదురుపడినా కొంచెం కూడా బెదరలేదు జింకలు. వాటి ముందు నుంచే పులి కదులుతున్నా అవి పారిపోవడానికి ప్రయత్నించలేదు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.