బావిలో పడిన గున్న ఏనుగును రక్షించిన అటవీ శాఖ - మయూర్ భంజ్లో గున్న ఏనుగు
ఒడిశా మయూర్ భంజ్ అటవీ ప్రాంతంలో బావిలో పడిన గున్న ఏనుగును అటవీ సిబ్బంది రక్షించారు. అటవీ ప్రాంతంలోని నీళ్లు లేని 15 అడుగుల బావిలో పడిపోగా స్ధానికులు గుర్తించారు. రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది.. దానికి చుట్టుపక్కల మట్టిని తవ్వి, తాళ్ల సాయంతో బయటకు తీశారు. అనంతరం అడవిలోకి వదిలిపెట్టారు.