15 గంటలు శ్రమించి.. గజరాజును రక్షించి! - elephant fell into a farm well
తమిళనాడు ధర్మపురి జిల్లా ఎలకందూర్ గ్రామంలో 50 అడుగుల లోతైన బావిలో పడిన ఏనుగును అటవీ శాఖ అధికారులు కాపాడారు. 15 గంటల పాటు నిర్విరామంగా కృషి చేసి 12 ఏళ్ల గజరాజును బయటకు తీశారు. ధర్మపురి, కిషంగిరి జిల్లాలోని దాదాపు 40 మంది అటవీ అధికారులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. రాత్రి పూట ఆహారం కోసం వచ్చిన ఏనుగు అదుపు తప్పి బావిలో పడిందని గ్రామస్థులు పేర్కొన్నారు.