బావిలో పడిన ఏనుగు.. మూడు గంటల తర్వాత.. - ఒడిశా
ఒడిశాలోని హిందోల్ అటవీ ప్రాంతంలో.. ఓ ఏనుగు బావిలో పడిపోయింది. బింబోరి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు ఏనుగు బావిలో పడినట్టు అనుమానిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీ అధికారులు, ఏనుగును రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్ను చేపట్టారు. మూడు గంటల అనంతరం ఏనుగును బావిలో నుంచి సురక్షితంగా బయటకు తీయగలిగారు. బయటకొచ్చిన ఏనుగు.. దాని గుంపుతో తిరిగి చేరింది.