బావిలో పడ్డ పిల్ల ఏనుగు.. టెక్నిక్‌తో బయటకు.. - బావిలో పడ్డ బుజ్జి ఏనుగు
Elephant Calf Rescue Odisha: ఒడిశా, మయూర్భంజ్ జిల్లా, చకుందపాద గ్రామంలోని రాస్గోవింద్పుర్ అటవీ ప్రాంతంలో ఓ ఏనుగు పిల్ల ప్రమాదవశాత్తు బావిలో పడింది. దీన్ని గమనించిన స్థానికులు.. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు ఏనుగు పిల్లను బయటకు తీసేందుకు దాదాపు 5గంటలపాటు శ్రమించారు. చివరికి బావిలోకి నీటిని పంపి.. బావి నిండాక ఏనుగు నీటిలో తేలుకుంటూ బయటకు వచ్చింది. ఇలాంటి పద్ధతిలో ఏనుగును బయటకు తీయడం ఇదే తొలిసారని అటవీ అధికారి రవినారాయణ్ మోహాంతి తెలిపారు. ఏనుగు పిల్లను.. అడవిలోని ఏనుగు గుంపులో విడిచిపెట్టినట్లు మరో అధికారి వనూమిత్ర తెలిపారు.