విద్యుత్తు కంచెను దాటేందుకు గజరాజు విశ్వప్రయత్నం - కర్ణాటక హస్సన్ జిల్లాలో ఓ తెలివైన ఏనుగు
కర్ణాటక హస్సన్ జిల్లాలో ఓ తెలివైన ఏనుగు వ్యూహం కెమెరాకు చిక్కింది. సకలేశ్పుర్ కొగరవల్లి గ్రామంలో.. చుట్టూ విద్యుత్తు తీగల కంచె వేసి ఉన్న ఓ కాఫీ తోటలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తూ కెమెరాకు చిక్కింది. ఆ తీగలను ఓ చెట్టు సాయంతో తెంచేందుకు పథకం పన్నింది గజం. కానీ, ఎంత ప్రయత్నించినా తీగలు తెగకపోయేసరికి నిరాశగా వెనుదిరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గజరాజు చాకచక్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.